
గరుడ ప్రతినిధి చౌడేపల్లి ఆగష్టు 01
చౌడేపల్లి మండలం దిగు పల్లి గ్రామం నందు కొలువైన శక్తి స్వరూపిణి జగత్ జనని లోకమాత అయిన బోయకొండ గంగమ్మకు శుక్రవారం అభిషేకాన్ని సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు ఉదయాన్నే ఆలయ అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో అమ్మవారిని అలంకరించి అనంతరం రాహుకాల సమయంలో దంపతుల సమక్షంలో అభిషేకాలు చేశారు రాహుకాల అభిషేకం దంపతుల సమక్షంలో చేయడం వల్ల వారి కుటుంబాలతో పాటు లోకం సుభిక్షంగా ఉంటుందని వేద పండితులు అంటున్నారు అనంతరం పాత కళ్యాణ కట్ట వద్ద ఉచిత అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం ఆలయ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత మరియు క్యూలైన్ల దగ్గర భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు ఉచిత అన్నదాన శిబిరాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నట్లు ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఈవో ఉపకమిషనర్ ఏకాంబరం తెలియజేశారు వచ్చిన భక్తులకు సౌకర్యార్థం మరియు భక్తులకు దర్శన భాగ్యాన్ని ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం మరియు ఆలయ అర్చక సిబ్బంది సేవలందించారు



