గరుడ ప్రతినిధి చౌడేపల్లి ఆగష్టు 02




అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రైతులతో కలిసి పీఎం కిసాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాన్ని లైవ్ ద్వారా వీక్షిస్తున్న చౌడేపల్లి మండలాధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చల్ల రామచంద్రారెడ్డి గారి సూచనలతో ఆగస్టు రెండవ తేదీన ఉదయం చౌడేపల్లి మండలం పెద్ద కొండ మర్రి గ్రామపంచాయతీ మరియు దిగువపల్లి పంచాయతీలలో రైతు సేవా కేంద్రం నందు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చౌడేపల్లి మండలం అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి విచ్చేశారు కార్యక్రమానికి విచ్చేసిన రమేష్ రెడ్డి కి చౌడేపల్లి మండల నాయకులు పూల చంద్రమౌళి కుమార్ రెడ్డి మరియు నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు రమేష్ రెడ్డి లబ్ధిదారులతోకలసి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా రైతులకు టీవీ ద్వారా చంద్రబాబు లైవ్ లో ప్రసంగిస్తున్న ప్రసంగాన్ని వీక్షించడం జరిగింది అదేవిధంగా కొత్తగా మంజూరు కాబడినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని అందజేశారు
పెన్షన్ అందుకున్న లబ్ధిదారులు మాట్లాడుతూ ఇంత గొప్ప పరిపాలన నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న నియోజకవర్గ ఇన్చార్జ్ చల్ల రామచంద్రారెడ్డి గారికి మరియు మాకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మాకు ఎలాంటి సమస్య వచ్చిన నేను ఉన్నాను అనే మనోధైర్యాన్ని అందిస్తున్న మండలాధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు
కార్యక్రమంలో మండల నాయకులు చంద్రమౌళి శ్రీనివాసులు నాయుడు బోయకొండ సుబ్బు రమణ చంగల్రాయప్ప కుమార్ రెడ్డి బలి రెడీ రాధాకృష్ణ పవన్ అర్జున్ సుభాన్ ప్రభుత్వ సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు


