93 ఏండ్ల కురువృద్ధుడు ఈనెల12వ తేదీ న తహసిల్ కార్యాలయం ముందు ధర్నా.

Srinivas Nayak
4 Min Read

93 ఏండ్ల కురువృద్ధుడు ఈనెల12వ తేదీ న తహసిల్ కార్యాలయం ముందు ధర్నా.
తమ భూమిని ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై యుద్ధం ప్రకటించిన 93 ఏళ్ల యూసఫ్ ఖాన్. స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన న్యాయం జరగడం లేదు.
మీ ఫిర్యాదు పై క్రిమినల్ కేసు పెట్టడం కుదరదు. ఇది సివిల్ కేస్ కిందికి వస్తుంది అని డిసైడ్ చేసిన పోలీసు అధికారి. ఒక వ్యక్తి భూమి మీదకి మరొకరు పోయి దౌర్జన్యం చేస్తే అది క్రిమినల్ కేసు కాదా?.
తన భూమి సర్వే నెంబర్ వేసి వేరే సర్వే నంబర్ల భూములు ప్లాట్లు చేసి అమ్ముకుంటే, ఆ భూమి యజమాను లు మీరు మీ భూమి మీదకు వస్తే చంపుతా0 అని భయభ్రాంతులకు గురి చేయడం క్రిమినల్ కిందికి రాధా?. ఇది క్రిమినల్ కేసు కిందికి రాదు. ఇది సివిల్ కేస్ కిందికి వస్తుంది అని రాతపూర్వకంగా ఇచ్చిన టౌన్ పోలీస్ అధికారులు.
ఇతను నన్ను అనవసరంగా తిట్టిండు అని పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేస్తేనే తిట్టిన వ్యక్తిపై కేసు పెట్టే వీరు మీ భూమిలోకి వస్తే మిమ్ముల చంపుతాము అనేది క్రిమినల్ కాదా?. చావుకు దగ్గరలో ఉన్న 93 సంవత్సరాల ఈ కురువృద్ధుడు ఈ నెల 12 నుండి తహశీల్ ఆఫీసు నందు ధర్నాకు దిగుతానని చెప్పడం ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు సిగ్గుపడవలసిన విషయం.
ఈ విషయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ లు చొరవ చూయించి ఈలోపే సమస్యను పరిష్కరించాలని వారి కుటుంబ సభ్యుల విన్నపం. ఈలోపు ఉన్నతాధికారులు స్పందించకుంటే, 93 సంవత్సరాల కురువృద్ధుడు తహశీల్ ఆఫీసు ముందు కనక ధర్నా చేస్తే ఈ ఇష్యూ పెద్ద దుమారం లేపే అవకాశం ఉంటుంది.

మహబూబాబాద్ బ్యూరో, ఆగస్టు03, (గరుడ న్యూస్)

తమ భూమి ఆక్రమించుకొని ఇబ్బందులకు గురిచేస్తున్న భూ కబ్జాదారుల ఆగడాలను భరించలేక ఈ నెల 12వ తేదీన స్థానిక తహసిల్దార్ ఆఫీస్ వద్ద యూసుఫ్ ఖాన్ అనే 93 ఏళ్ల కురు వ్రృద్ధుడు ధర్నాకుసిద్ధమవుతున్నారు.ఈ విషయమై ఆదివారం మహబూబాబాద్ లో పట్టణానికి చెందిన ముస్లింలు స్థానిక ఈద్గాలో పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో యూసుఫ్ ఖాన్ కుటుంబ సభ్యులతో పాటు వివిధ పార్టీలకు చెందిన, వివిధ కమిటీలకు చెందిన,ముస్లింలు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా యూసుఫ్ ఖాన్ కుమారుడైన అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ, జులై నెల 12వ తేదీన మండల సర్వేయర్ సర్వే ప్రకారం మా హద్దులకు మేము రాళ్లు పాతుకోగా కబ్జాదారులు తొలగించడం జరిగింది. ఈ విషయమై టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కూడా పోలీసులు నిర్లక్ష్యంతో ఉన్నారు. పోలీసుల నిర్లక్ష్యంతో మరింతగా పోయిన కబ్జాదారులు ఆ భూమిలోకి వస్తే మిమ్మల్ని చంపేస్తామని, భూమిలోకి రానివ్వడం లేదని వారి ఆగడాలకు విసిగిపోయిన తన తండ్రి 93 ఏళ్ల యూసుఫ్ అలీ ఖాన్ ఈ నెల 12వ తేదీన స్థానిక తహసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నాకు సిద్ధమవుతున్నారని అన్నారు.
కంకర్ బోడు మసీద్ కు చెందిన మసీద్ ప్రెసిడెంట్ మహమ్మద్ అదిల్.మాట్లాడుతూ-ముస్లింలపై దౌర్జన్యాలు చేయడం మంచి పద్ధతి కాదని,ఇప్పటికైనా భూకబ్జా దారులుతమ వైఖరి మార్చుకోవాలని, ఇది ఒక కుటుంబ సమస్య కాదని, మహబూబాబాద్ లోని ప్రతి ముస్లిం సమస్య అని ఈ సమస్యను కలిసికట్టుగా ఎదుర్కొంటామని అన్నారు.
ఇస్లేహా మాషిర కమిటీ మహబూబాబాద్ అధ్యక్షులు ఎండి ఇక్బాల్ మాట్లాడుతూ-చాలా తేలికగా పరిష్కారం అయ్యే సమస్యను భూకబ్జాదారులు జటిలం చేసుకుంటున్నారని, యూసుఫ్ ఖాన్ కుటుంబం ఎలా సర్వే చేసుకున్నారో, పక్క వారు కూడా తమ తమ భూములకు సర్వే నిర్వహించుకోవడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని ,మహబూబాబాద్ కు చెందిన రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, స్థానిక ఎమ్మెల్యే చోరవ తీసుకొని పక్క వారి భూమి కూడా సర్వే చేయడం వల్ల ఈ సమస్య అతి తేలికగా పరిష్కారం అవుతుందని, సంబంధిత అధికారులు, స్థానిక ఎమ్మెల్యే గారు ఈ విషయమై సానుకూలంగా స్పందించి సమస్యను త్వరగా పరిష్కారం చేయాలని, ఈ నెల 12వ తేదీ నాడు యూసుఫ్ అలీఖాన్ ధర్నా చేయకముందే సమస్య పరిష్కారమైతే అందరికీ బాగుంటుందని, 93 ఏళ్ల కురు వ్రృద్ధుడు తన హక్కుల కోసం ధర్నా చేయడం ముస్లిం సమాజానికి, ప్రభుత్వానికి మంచిది కాదని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్ నాయక్, సయ్యద్ సాదిక్, నిజాం, మక్బూల్, నజీర్, అబ్దుల్ కలీం, యాఖుబ్ పాషా, ముజాఫర్, జియా, ఇంతియాజ్ ఖాన్, మహమ్మద్ అలీఖాన్, అలీమ్, ఫజల్, అన్వర్, ఫెరోజ్, అజీజ్, అజీమ్, సఫర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *