
గరుడ ప్రతినిధి
చౌడేపల్లి ఆగష్టు 04
మండల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి కోరారు సోమవారం స్థానిక మండల పరిపాలన భవనంలోని ఎంపీడీవో తహసిల్దార్ ఈజీఎస్ కార్యాలయాలను ఆయన సందర్శించి అధికారులతో మండల సమస్యలపై సమీక్షించారు రానున్నది వర్షాకాలమని అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రజలు సమస్యలతో కార్యాలయాలకు వస్తే వారి సమస్యల పరిష్కారం వైపు మొగ్గుచూపాలన్నారు అనంతరం ఆయా అధికారుల పనితీరును సమీక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీధర్ రాజు బోయకొండ సుబ్బు సోము పవన్ కుమార్ అర్జున్ రాయల్ తదితరులు పాల్గొన్నారు

