
గరుడ ప్రతినిధి
చౌడేపల్లి ఆగష్టు 04
మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డికి వైకాపా ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మండల వైకాపా అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి ప్రసంగిస్తూ గోపాల్ రెడ్డి సర్పంచ్ గా చింతమాకులపల్లి గ్రామపంచాయతీ కి అనేక సేవలు చేశారని గుర్తు చేశారు ఆయన మరణం పంచాయతీ ప్రజలతో పాటు పార్టీకి తీరని లోటు అని అన్నారు అనంతరం గోపాల్ రెడ్డి మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ మండల ఉపాధ్యక్షుడు నరసింహులు యాదవ్ సాదిక్ భాషా వైకాపా మండల ఉపాధ్యక్షుడు జంగాలపల్లి రమణ శంకర తదితరులు పాల్గొన్నారు

