


గరుడ న్యూస్ ప్రతినిధి రాజేష్
కరోనాలో కాపాడిన చెవిరెడ్డిని కటకటలా పాలు చేశారు
– కూటమి నేతల చొక్కాలు పట్టుకుని నిలదీస్తామన్న మహిళలు
– ‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమం విజయవంతం. అమ్మా.. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు అన్నీ అమలవుతున్నాయా..? ఆయన చెప్పిన సూపర్ సిక్స్‌లో ఒక్కటైన అమ్మకువందనం అందరికీ అందిందా…? ప్రతినెలా ఆడబిడ్డ నిధి కింద ఇస్తామన్న రూ.1500 లు ప్రతి నెలా ఇస్తున్నారా..? 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇచ్చారా..? నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి నెలా రూ.8 వేలు నిరుద్యోగ బృతి కింద ఇస్తామని చెప్పారు.. ఎవ్వరికైనా ఇచ్చారా..? ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు ? అందరికీ వచ్చాయా ? ఉచితంగా బస్సుల్లో ఎక్కడికైనా వెళ్లొచ్చన్నారు.. ? ఆ అవకాశం కల్పించారా ?’’ అంటూ గత ఎన్నికల్లో చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై చంద్రగిరి నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ప్రశ్నించారు. చంద్రగిరి పట్టణంలోని వైఎస్ఎంఆర్ కల్యాణ మండపంలో సోమవారం ‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి రావడానికి అడ్డమైన అబద్ధాలు అన్నీ చెప్పారని, అది నిజమన్న విషయం ఈ ఏడాది పాలనలో అర్థమైందని చెప్పడంతో అక్కడి వాసులు అందుకు అంగీకరించారు. చంద్రబాబు వంటి నమ్మకద్రోహి, నయవంచకుడు ఈ ప్రపంచంలోనే లేరన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. జగనన్న అందించే సంక్షేమ పథకాలను అలాగే కొనసాగిస్తానని, అంతకంటే రెండింతలు అదనంగా ఇస్తానన్న చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. కూటమి పార్టీల నేతలు మీ ఇళ్ల వద్దకు వచ్చినపుడు నిగ్గదీసి అడగాలన్నారు. అనంతరం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ తయారు చేసిన క్యూ ఆర్ కోడ్ స్కానర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండలంకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
