
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,ఆగస్టు05,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు,చిమిర్యాల మాజీ సర్పంచ్,దోనూరు జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని స్థానిక చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ నేపథ్యంలో ఆయనకు శాల్వ కప్పి,కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నాయకులు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ,జిల్లా కార్యదర్శి ఏపూరి సతీష్,మండల అధ్యక్షులు శ్రీను నాయక్ నాయక్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ అక్బర్ అలీ,నోముల మాధవరెడ్డి,జక్కడి బాల్ రెడ్డి,గుత్తా శేఖర్ రెడ్డి,ఈసం స్వామి,శేఖర్ రెడ్డి,రెడ్యా నాయక్,ఉప్పల నాగరాజు,అంతటి స్వామి,వంశీ యాదవ్,మెరుగు గిరి,మేకల శేఖర్,బద్దుల యాదగిరి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.



