
గరుడ న్యూస్ , సాలూరు
పత్తి పంటలో ప్రస్తుతం పేనుబంక ఉధృతి అధికంగా ఉందని పేను బంక ఆకుల అడుగుభాగాన ఆశించి రసం పీల్చడం వలన పత్తి పంట బలహీనంగా మారుతుందని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. విశ్వనాథపురం గ్రామంలో గ్రామ వ్యవసాయ సహాయకులు అశ్విని లావణ్య తో కలిసి పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు పత్తిలో ప్రశంపించు పురుగుల ఉధృతి అధికంగా అవుతుందని ప్రస్తుతం పత్తి పంటలో పేను బంక ఉధృతి అధికంగా ఉందని రైతులు పత్తి పంటపై నల్ల కండ చీమలు పాకడం చూసినట్లయితే పేను బంకగా గుర్తించాలని పెనుబంక ఉదృతంగా ఉంటే రసం పిలిచి ఆకుపై నల్లటి మసి పదార్థాన్ని ఏర్పరుస్తాయని దీనివలన పంటలలో కిరణజన్య సంయోగ క్రియ ప్రభావం తగ్గి పంట బలహీనంగా మారడం వలన దిగుబడి తగ్గుతాయని కాబట్టి పత్తి పీల్చు పురుగుల థయోమెతాక్జోమ్ లేదా ఎసిటమీప్రీడ్ లేదా ఇమిడా క్లోపరిడ్ లేదా ఫ్లోనికామిడ్ మందులలో ఒకదానిని 100 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పంట బాగా తడిచేటట్టు పిచికారి చేయాలని తెలిపారు.
మెట్టవలసలో వరుసలలో వరి నాట్లపై శిక్షణ: వరుసలలో వరి నాట్లు వేసుకోవడం ద్వారా పంటలో గాలి వెలుతురు బాగా సోకుతుందని దీనివలన దోమపోటు ఉధృతి బాగా తగ్గుతుందని మొక్కల సంఖ్య సరిపడినంత ఉండడం వలన దిగుబడి బాగా పెరుగుతుందని తెలిపారు. ఆశ్ర ఆధ్వర్యంలో వరి నాట్లపై రైతులకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటూ కుదురుకు ఒకటి లేదా రెండు మొనలు మాత్రమే నాటాలని తేలికపాటి నాట్లు వేసుకోవాలని చివరలో తుంచి నాటడం ద్వారా కాండంతలు పురుగును గుడ్లు దశలోనే నివారించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఈఓ గణేష్ పాల్గొన్నారు.

