
కురుపాం కళింగ వైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం..


కురుపాం కళింగ వైశ్య అధ్యక్షులుగా అంధవరపు కోటేశ్వరరావును ఏకగ్రీవంగా కురుపాం కళింగ వైశ్య కుటుంబాల పెద్దల సమక్షంలో కోటి సైట్ లో ఎన్నుకోవడం జరిగిందని ఆయన అన్నారు.ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్టేట్ ట్రెజరర్ పట్నాల కిరణ్ కుమార్,హాజరై ఆయన చేతుల మీదుగా పూలమాలలు వేసి దుస్సాలువతో సత్కరించారు. అలాగే పార్వతీపురం, కొత్తవలస, గరుగుబిల్లి గుమ్మలక్ష్మీపురం,కళింగ వైశ్య అధ్యక్షులు పూలమాలలు వేసి దుస్సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా శనివారం కళింగ వైశ్య అధ్యక్షులుగా అంధవరపు కోటేశ్వరరావు మాట్లాడుతూ కురుపాం కళింగ వైశ్య అధ్యక్షుడుగా రెండుసార్లు చేశామన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా అధ్యక్షులుగా రెండుసార్లు చేశామన్నారు.అదే విధంగా ప్రస్తుతం స్టేట్ గౌరాధ్యక్షులుగా,పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు గా ప్రస్తుతం కొనసాగుతున్నానని ఆయన అన్నారు. దీనిలో భాగంగా కురుపాం కళింగ వైశ్య అధ్యక్షులుగా పదవీకాలం పూర్తయిన సందర్భంగా మరలా కురుపాం కళింగ వైశ్య అధ్యక్షులుగా అంధవరపు కోటేశ్వరరావును ఏకగ్రీవంగా 300మంది సుమారు కళింగ వైశ్య కుటుంబాల మధ్య ఎన్నుకోవడం జరిగిందన్నారు.ఈసందర్భంగా ఆయన అభినందిస్తూ , కళింగ వైశ్య కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి దుస్సాలువతో కప్పి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.
