
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,లచ్చమ్మ గూడెం,ఆగస్టు05,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని లచ్చమ్మ గూడెం,గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన 33/11, సబ్ స్టేషన్ లో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం ఎక్కడ కూడా విద్యుత్ శక్తి ఇబ్బందులు ఉండకుండా అవసరం ఉన్నన్ని సబ్ స్టేషన్లను నిర్మిస్తున్నామని,విద్యుత్ వల్ల రైతులు ఇబ్బందులు పడకుండా లో వోల్టేజ్ లేకుండా పూర్తిగా అభివృద్ధి చేస్తామని పత్రికాముఖంగా ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,మందుగుల బాలకృష్ణ,ఏపూరి సతీష్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శీను నాయక్,మాజీ ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ చందర్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి వీరమల్ల భానుమతి వెంకటేష్ గౌడ్,ముద్దంగుల నరసింహ,మహమ్మద్ అక్బర్ అలీ,ఉప్పల లింగస్వామి,జక్కలి ఐలయ్య యాదవ్,కుక్కల నరసింహ,పగిళ్ళ శేఖర్,మాజీ ఎంపీపీ బుజ్జి నాయక్,కారంటోత్ రమేష్ నాయక్,కోన్ రెడ్డి నరసింహ,విద్యుత్ సిబ్బంది ఎస్ ఈ సుధీర్ కుమార్,డిఈ మల్లికార్జున్,డిఈటి సుధీర్ కుమార్,డిఈ ఎంర్ టి విజయ్ భాస్కర్,ఎడీఈ పద్మ,ఎడీఈ సంధ్యారాణి,శ్రీనివాస్ రెడ్డి,సత్యనారాయణ రాజు,నారాయణపురం ఏఈ దివ్య,సబ్ మల్లేష్,లైన్మెన్,యాదగిరి,నరేందర్,సురేష్,సుధాకర్,జంగయ్య,ఉపేందర్,విష్ణు,సత్యనారాయణ,తదితరులు,పాల్గొన్నారు.




