

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,పుట్టపాక,ఆగస్టు06,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని పుట్టపాక గ్రామంలో సామల భాస్కర్ తయారుచేసిన చేనేత చీరకు తెలంగాణ రాష్ట్ర కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపిక అయినది.
అవార్డుకు ఎంపికైన చీర పేరు,(గుడ్ లెస్ ఆఫ్ పికాక్ ఇక్కత్ హ్యాండ్లూమ్ సాటిన్ సారీ)మార్కెట్లో తయారయ్యే సాధారణ చీరలు అమ్మకాలు సరిగా లేక చేనేత కళాకారుల జీవనోపాధి క్లిష్టంగా మారినది.వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని తయారయ్యే చీరలు వినూత్నంగా ఉండాలనే ఆలోచనతో నెమలి దేవత గల డిజైన్ ను రూపొందించారు.ఈయొక్క చీర కొంగు వెయ్యి మెట్లతో మరియు బాడీ డిజైన్ 450 మెట్లతో గ్రాఫ్ ను రూపొందించి,నిలువు డిజైన్ సాదా,పేక డిజైన్ 3డి ఎఫెక్ట్ మాదిరిగా కనిపించే విధంగా నాలుగు అచ్చులతో రెండున్నర కొలుకులతో బాడీ డిజైన్,కొలికినరతో కొంగు వెప్టు డిజైన్ తో టస్సారు,ఎల్లో బ్రౌన్,గ్రీన్,రాయల్ బ్లూ,రెడ్,బ్లాకు ఏడు రంగులతో అద్దకం చేసి స్పెషల్ గా చీర తయారు చేశారు.వినూత్నంగా తయారు చేసిన చేనేత చీరకు నైపుణ్యాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు ప్రకటించినందుకు,ఇచ్చే అవార్డుతో కళకు గుర్తింపునిస్తూ,మార్కెటింగ్ ఎక్కువగా జరుగుటకు ఊతమిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సామల భాస్కర్ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
