


మొబ్బునేనిపల్లి, దాముల చెరువు, పాకాల మండలం, తిరుపతి జిల్లా లో అమోఘమైన పూజలతో వెలసిన శ్రీ శ్రీ శ్రీ ద్రౌపతి ధర్మరాజుల ఆలయం. 15 సంవత్సరాలుగా నిరాటంకంగా మహాభారత యజ్ఞం జరుగుచున్నది. 2011లో అన్నగారి సుపుత్రుడైన చైతన్యకుమార్ కు విధి వక్రీంచండం తో స్వర్గస్తులైనారన్న విషయాన్ని మరిచిపోలేక, ఆయన పేరును చిరస్థాయిగా నిలబెట్టాలన్న దృఢ సంకల్పంతో *మొబ్బినేని రఘుపతి* *శ్రీ చైతన్య చారిటబుల్ ట్రస్ట్* ను స్థాపించారు. తద్వారా మహాభారత మహా యజ్ఞం, అన్నదాన కార్యక్రమాలు, ఆలయ అభివృద్ధి వంటి ఎన్నో సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ పాకాల మండలం, దామలచెరువు, మొబ్బినేనిపల్లెని ఆధ్యాత్మిక కేంద్రంగా మలిచారు. రఘుపతి గారు రాజకీయ నాయకుడు కాదు – ప్రజల మనిషి, సేవా తత్పరుడు, భగవంతునిపై భక్తి, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి, ప్రజల పట్ల దయా గుణం, సేవా తపన ఆయన సొంతం. ఇలాంటి కార్యక్రమాలు ఆయనను తమదైన స్టైల్ లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. చైతన్య సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, స్వర్గీయ *చైతన్యకుమార్* పేరును చిరస్థాయిగా నిలిపారు.
*ఆదిపరాశక్తి అంశైన శ్రీ శ్రీ శ్రీ ద్రౌపది అమ్మవారి* ఆశీస్సులతో గౌరవనీయులు రఘుపతి గారు, కుటుంబ సభ్యులు, ఆయురారోగ్యా భోగభాగ్యాలతో తలతోగుతూ నిండిన నూరేళ్లు సకల సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నారు స్థానిక భక్తాదులందరూ….

