గరుడ న్యూస్ ,విజయవాడ
వాగ్దేవి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ విజయవాడ (పాణిగ్రాహి రాజశేఖర్) ఆధ్వర్యంలో దివంగత చెన్నాప్రగడ సుబ్రహ్మణ్య శర్మ కనక సత్యవతి స్మారక చిన్నికృష్ణుల వేష ధారణ పోటీలు ఆగస్టు 16న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్ని కృష్ణుల వేష ధారణ పోటీలు నిర్వహిస్తున్నారు. దీనికి మీరు చేయవలసిందల్లా మీ 10 ఏళ్లలోపు పిల్లలను శ్రీ బాల కృష్ణుడిగా ,రాధ గా అలంకరించి వారితో చిన్న చిన్న పద్యాలు శ్లోకాలు డైలాగులు చెప్పించి మీ సెల్ ఫోను నిలువుగా పెట్టి ఒక నిమిషంలో వీడియో తీసి మాకు పంపండి ఎవరికైతే ఎక్కువ వ్యూస్ వస్తాయో వాళ్లకు నగదు బహుమతితో పాటు మెమెంటో, డిజిటల్ సర్టిఫికెట్స్ అందజేస్తామని, కావున మన సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరం పిల్లలకు పరిచయం చేయడంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని సనాతన ధర్మాన్ని కాపాడాలని వాగ్దేవి క్రియేషన్స్ యూ ట్యూబ్ ఛానల్ పాణిగ్రాహి రాజశేఖర్ తెలిపారు. మరిన్ని వివరాలకు 99 51185876, 944 0587567 నెంబర్లకు సంప్రదించగలరు. ఆగస్టు 10వ తేదీ లోపు తమ వీడియోలను పంపించగలరు.




