
గరుడ న్యూస్ పాచిపెంట రూరల్
ఆరోగ్యవంతమైన మంటను పండిస్తూ ఖర్చులు తగ్గించుకుని పర్యావరణానికి హాని జరగకుండా నిరంతర పరిశీలన ద్వారా మిత్ర పురుగులను సంరక్షించుకుంటూ దిగుబడిని పెంచే కార్యక్రమమే పొలంబడి అని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. పెద్ద కన్చూరు గ్రామంలో మొదటి వారం నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో మాట్లాడుతూ 14 వారాలపాటు చోడి పంట దిగుబడి పెరగడానికి కావలసిన మేలైన యాజమాన్య పద్ధతులను వివరించడం జరుగుతుందని 14 వారాల తర్వాత చోడి పంట నమూనాలను పరిశీలనకు పంపించి ఎలాంటి రసాయనాల అవశేషాలు లేనియెడల రైతులకు మేలైన వ్యవసాయ యాజమాన్య పద్ధతులపై సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుందని అనంతరం రైతులు తమ ఉత్పత్తులను రసాయన రహిత ఉత్పత్తులుగా ఆన్లైన్ లో విక్రయించుకోవచ్చని తెలిపారు. మొదటి వారం సందర్భంగా పురుగులు తెగుళ్ల నివారణ రసాయనాలు విష ప్రభావం వలన మనుషులలో కలిగే ప్రమాదాలను వివరించారు ఈ సందర్భంగా ప్రకృతి సేద్య సిఆర్పి సురేష్ జీవ వైవిధ్యం నశించకుండా ప్రకృతి సేద్య పద్ధతులను వివరించారు. ఏ ఈ ఓ శ్రీహరి నాయుడు పొలంబడి ప్రాశస్యాన్ని వివరించారు గ్రామ వ్యవసాయ సహాయకులు యశోద కృష్ణ, అన్నదాత సుఖీభవ విత్తనాల లభ్యత నానో ఎరువుల ప్రాశస్యాన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐ సి ఆర్ పి లు అప్పన్న, సంజీవి గ్రామ రైతులు పాల్గొన్నారు.

