గరుడ న్యూస్. సోమల మండలం, ఆవులపల్లి గ్రామ పంచాయతీ కొత్తూరు లో ఏనుగుల దాడిలో మరణించిన రామకృష్ణమరాజు కుటుంబాన్ని గురువారం చౌడేపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు లక్ష్మిపతిరాజు, పరామర్శించారు. ఈ సందర్బంగా లక్ష్మిపతిరాజు మాట్లాడుతూ వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, పిల్లల చదువులకు బాసటగా ఉంటామని అన్నారు.యువనాయకుడు కార్తీక్, సింగిల్ విండో చైర్మన్ హరి రాయల్ మాట్లాడుతూ రామకృష్ణమరాజు కు జరిగిన అన్యాయం ఇంకోక్కరికి జరగకూడదని, ఇలా ఏనుగుల దాడులలో ఎన్నో కుటుంబాలు తమవారిని కోల్పోయారని, కాబట్టి ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేపట్టేవిధముగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే వారి కుటుంబానికి ఆర్థిక సహాయం, మరియు నిత్యవసర సరుకులు అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సోమల మండలం తెలుగు దేశం నాయకులు వేణుగోపాల్ నాయుడు,పుంగనూరు తెలుగుదేశం యువత ఉపాధ్యక్షులు నాగరాజ రెడ్డి, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.



