
గరుడ న్యూస్. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బుధవారం అర్ధరాత్రి ఎల్ఈడి టీవీ చోరీకి గురైన ఘటన పట్టణంలో కలకలం రేపింది. చోరీ చేసి ఎత్తుకెళ్లిన టీవీని పారిశుద్ధ్య కార్మికుడు సుబ్రహ్మణ్యం ఆసుపత్రికి తీసుకువచ్చి ఎక్కడ ఉన్నచోటే అక్కడే అమర్చాడు. ఘటనపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ హరి గోపాల్ మాట్లాడుతూ ఎల్ఈడి టీవీ చోరీకి పాల్పడిన పారిశుద్ధ కార్మికుడు సుబ్రహ్మణ్యం పై విచారించి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.
