సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,ఆగస్టు08,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం లోని పద్మశాలి చేనేత సహకార సంఘం వారి ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు చేనేత వస్త్రాలకు ఆదరణ కరువైతుందని,చేనేత మగ్గాలపై నేసిన వస్త్రాలకు బదులుగా డూప్లికేట్ ప్రింటింగ్ చీరలు మార్కెట్లోకి వచ్చి చేనేత కార్మికుల పొట్ట కొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులను ఆదుకొని వారి అభివృద్ధి కొరకై పాటుపడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సంగిశెట్టి లక్ష్మీనారాయణ,వంగరి రఘు,సురేపల్లి గాలయ్య,విడం వెంకటేశం,గుర్రం సత్యనారాయణ,గంజి వేణు,మేకల బిక్షపతి,చేనేత కార్మికులు,తదితరులు పాల్గొన్నారు.



