
గరుడ న్యూస్ పెద్దపంజాణి ఆగస్టు 08

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం జనసురక్ష పథకాలు సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ సూచింరు. పెద్దపంజాణి మండలం కొలతురు పంచాయతీ మద్దలకుంటలో కేంద్ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, జీవనజ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాల వల్ల బీమా వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ మరియు స్టాఫ్, బ్యాంకు మిత్ర నాగరాజ, సంఘమిత్ర జగన్ మరియు రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు