గరుడ ప్రతినిధి
చౌడేపల్లి ఆగష్టు 09
శ్రావణమాసం శనివారం శ్రవణ నక్షత్రం మూడు ఒకేసారి రావడంతో స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి శనివారం ఇలాంటి విశేషం జరగడం 150 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే శనివారం శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం స్వామివారికి ఇష్టమైన రోజుగా వేద పండితులు అంటున్నారు దీంతో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి ఆలయ ప్రధాన అర్చకుడు వశిష్టాచార్యుల ఆధ్వర్యంలో ఉదయాన్నే అభిషేకాలు అలంకరణలు చేశారు ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు ఈ ప్రాంతం నుంచి కాకుండా చుట్టుపక్కల గురించి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి ముడుపులు చెల్లించుకున్నారు అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు పవిత్ర తీర్థప్రసాదాలు అందించారు



