


చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం:-
గరుడ న్యూస్:- శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియర్స్ వారిచే, PES హాస్పిటల్ వారి సహకారంతో PES అర్బన్ హాస్పిటల్ నందుఉచిత కంటి, మరియు డయాబెటిక్ శిబిరం దిగ్విజయంగా జరిగింది. ఈ శిభిరానికి 100 మందికి పైగా హాజరు అయ్యారు. వారిలో 16 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సకు సిఫార్సు చేయడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అడ్వైజర్ మహేష్ మాట్లాడుతూ వృద్ధాప్యం, పౌష్టిక ఆహారలోపం మరియు అధిక సమయం మొబైల్ వాడటం వల్ల కంటి చూపు లోపించిన వారికి అదేవిధంగా డయాబెటిక్‌తో బాధపడుతున్న వారికి వైద్యం చేయించాలనే సదుద్దేశంతో ప్రతి నెల రెండవ శనివారం PES అర్బన్ సెంటర్ లో క్యాంపు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అందులో భాగంగా ఈ రోజు కూడా PES వారి సహకారంతో శిబిరాన్ని ఏర్పాటుచేసి వైద్య పరీక్షలు చేసి తగు సూచనలు మరియు మందులు అందించారు. ఈ రోజు వైద్య శిబిరానికి వచ్చిన వారికీ లయన్స్ క్లబ్ డైరెక్టర్ & అక్షయ స్కూల్ కరెస్పాండంట్ డా.శరవణన్ మరియు వారి కుటుంబ సభ్యులు భోజనాలు అందించారు. కుప్పం ప్రాంత ప్రజల మంచిని కోరుతూ ప్రతి నెల రెండవ శనివారం వైద్య సేవలు అందించాలానే ఉద్దేశంతో ఇలాంటి ఉచిత శిబిరాలు నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని కుప్పం ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోని ఆరోగ్య కుప్పంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు డా. సుదర్శన్, కార్యదర్శి శివ, వైస్ ప్రెసిడెంట్ సెల్వం, సభ్యులు జయరాం నాయుడు, వెంకటస్వామి, డా.కృష్ణమూర్తి, డా.వరదరాజులు, ఏకాంబరం, సతీష్ మరియు వైద్య సిబంది పాల్గొన్నారు .


