
గరుడ న్యూస్, సాలూరు
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో పవిత్ర గోముఖీ నదీ తీరమున వెలసిన భక్తుల ఇలవేల్పు ఉత్తరాంధ్ర గిరిజన ఆరాధ్య దేవత,చల్లని తల్లి పోలమాంబ అమ్మవారి ఆలయం చదురుగుడి నందు స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరం శ్రావణమాసం సందర్భంగా ఆగస్టు 15న 4వ శుక్రవారం సామూహిక ఉచిత కుంకుమ పూజలు ఉదయం 9 గంటలకు ప్రముఖ ఋత్విక్యులచే జరుపబడును. కావున భక్తులు, స్త్రీలు అందరూ కుంకుమ పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ పోలమాంబ అమ్మవారి దివ్య ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదములు స్వీకరించ కోరుచున్నాము.
(పూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు శ్రీ అమ్మవారి పసుపు, కుంకుమ, గాజులు, తమలపాకులు వగైరా పూజ సామాగ్రి దేవస్థానము నుండి ఇవ్వబడును.) పూజలో పాల్గొను భక్తులు కలశం, కొబ్బరికాయ,ఆచమనపాత్ర , పూలు, అమ్మవారికి నైవేద్యం వగైరా తీసుకొని రాగలరని కార్యనిర్వహణా అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు.

