

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,అగస్టు14,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుమతితో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీను నాయక్,ఆధ్వర్యంలో నూతనంగా కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని ప్రారంభించారు.తదనంతరం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వివిధ గ్రామాల బాధితులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,మండల నాయకులు,కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 31 గ్రామపంచాయతీల గ్రామ శాఖ అధ్యక్షులు,కార్యకర్తలు అభిమానులు,అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

