
గరుడ ప్రతినిధి
చౌడేపల్లి ఆగష్టు 14
నాణ్యతతో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని మండల ప్రత్యేక అధికారి విజయ్ కుమార్ అన్నారు గురువారం మండలంలోని పుదిపట్ల ఉన్నత పాఠశాలలో అమలులో ఉన్న డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం అమలును పర్యవేక్షించారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు భోజనం చేస్తున్న పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకున్నారు మధ్యాహ్నం భోజనం పథకం అమలు తీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లీలా మాధవి ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ సురేష్ రెడ్డి ప్రధానోపాధ్యాయురాలు పద్మజ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
