గరుడ న్యూస్ పెద్ద పంజని ఆగస్టు 14
పెద్దపంజాణి మండలం, కొత్తవీరప్పల్లి లో బాలసుబ్రమణ్య స్వామి దేవస్థానము నందు వెలసిన యోగ నందీశ్వర ఆలయం లో ఆడికకఆడికృతిక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని,శనివారం, 16 వతేది యోగనందీశ్వర స్వామి ఆలయం లో వెలసిన బాలసుబ్రమణ్యస్వామి వారికి కృతిక కావిళ్ళు చెల్లించబడును.ఈ కార్యక్రమం లో ఉదయం ఐదుగంటలకు గణపతి, శివుడు, పార్వతీదేవికి, పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, ఆరుగంటలకు బాలసుబ్రమణ్యస్వామి వారికి ద్వాదశ కుంబాభిషేకం, తదుపరి మూలమంత్రోచ్చారణ, పుష్పకావిళ్ళు చెల్లిచబడునని, కావున భక్తులు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోని, స్వామి వారి కృపకు పాతృలుకాగలరని కొత్త వీరప్పల్లి గ్రామస్తులు
నిర్వాహకులు తెలియజేశారు.



