
పేకాట స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించిన పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు
08 మంది వ్యక్తులు,2,22,130/- నగదు, 02 కార్లు, 04 ద్విచక్ర వాహనాలు, 07 చరవాణిలు స్వాధీనం చేసుకున్న పార్వతీపురం రూరల్ పోలీసులు
07గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, 2,330/- నగదును స్వాధీనం చేసుకున్న సీతానగరం పోలీసులు
పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపీఎస్ ఆదేశాల మేరకు పార్వతీపురం మండలం, బాల గుడబ గ్రామం, శివారు ప్రాంతం జీడి తోటలో పేకాట ఆడుచున్నారని, జిల్లా స్పెషల్ బ్రాంచ్ వారికి రాబడిన సమాచారం మేరకు పార్వతీపురం రూరల్ ఎస్సై సంతోషి కి తెలియజేయగా, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది కలిసి సంయుక్తంగా గ్రామ శివారు ప్రాంతం జీడి తోటలో పేకాట ఆడుతున్న వారిపై ఆకస్మిక దాడి నిర్వహించి 08 మంది వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి 2,22,130/- నగదును, 02 కార్లను, 04 ద్విచక్ర వాహనాలను, 07 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
సీతానగరం మండలం, రామవరం గ్రామం శివారు ప్రాంతం లో పేకాట ఆడుతున్న వారిపై, సీతానగరం ఎస్సై రాజేష్ యొక్క సిబ్బంది మరియు స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది కలిసి ఆకస్మిక దాడి నిర్వహించి 07 వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 2,330/- నగదు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేయడమైనది.
