గరుడ ప్రతినిధి చౌడేపల్లి ఆగష్టు 15
విద్యుత్ షాక్కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది ఎస్ఐ నాగేశ్వరరావు కథ మేరకు... బోయకొండ పుంగనూరు ప్రధాన రహదారిలో కొలింపల్లి కర్ణంవారి పల్లి మీదుగా జెసిబిని లారీ ద్వారా తరలిస్తుండగా కరణం వారి పల్లి వద్ద విద్యుత్ తీగలు తగలాయి దీంతో జెసిబి లో ఉన్న సుబ్రహ్మణ్యం రెడ్డి 30 విద్యుత్ షాక్కు గురై కిందికి పడ్డాడు ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు రామసముద్రం మండలం టీ గొల్లపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డి విద్యుత్ షాక్ తో మృతి చెందడంతో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం పోయిందని గ్రామస్తులు అంటున్నారు విద్యుత్ అధికారులు బిల్లులు వసూలు చేసే దానిపైన పెట్టే శ్రద్ధ కరెంటు తీగల పైన కూడా పెడితే బాగుంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు



