

స్వాతంత్ర సమరయోధుల వీరోచిత పోరాటమే నేటి స్వాతంత్ర్య భారతదేశమని ప్రపంచ దేశాల యందు గొప్ప చరిత్ర కలిగిన భారత దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు గర్వంగా అనుభూతి చెందుతూ విద్యార్థులు కన్న తల్లిదండ్రులకు, చదువుకున్న పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా మలుచుకోవాలని గరుగుబిల్లి అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఏ .రజిని అన్నారు . 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కళాశాలలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి విద్యార్థులకు , ఉపాధ్యాయులు కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు భారతదేశ గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని అన్నారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొని అలరించారు. కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు , పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.