
గరుడ న్యూస్,సాలూరు
ఇటీవల ఆర్ఎస్ అకాడమీ వారు నిర్వహించిన మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్ లో విజేతలకు ఆగస్టు 15 సందర్భంగా వేలమపేట ఆర్ఎస్ అకాడమీ లో బహుమతుల ను అందించారు. సీనియర్స్ ఎనిమిదో తరగతి, తొమ్మిదో తరగతి, పదో తరగతి క్యాటగిరిలో సాలూరు నారాయణ స్కూల్ 8 వ తరగతి విద్యార్థి గనేడ గగన్ కుమార్ 82.5, మక్కువ జెడ్. పి .హెచ్ 10 వ తరగతి విద్యార్దిని ఎల్. సౌమ్య సాయి 74.0,సాలూరు భాష్యం స్కూల్ కు చెందిన 8 వ తరగతి విద్యార్దిని గంజి ధనూష 61.5 మార్కులను సాధించింది.జూనియర్స్ కేటగిరి లో రామభద్రపురం గ్లోబల్ వ్యూ స్కూల్ కి చెందిన రేపాక జ్యోత్స్న 86 మార్కులు, శంబర జెడ్. పి.హెచ్ స్కూల్ కి చెందిన ఏడవ తరగతి విద్యార్థి బలగ మౌళి 85 మార్కులు, భాష్యం స్కూల్ సాలూరు కి చెందిన 6వ తరగతి విద్యార్దిని జి. మనస్విని 80 మార్కులు సాధించారు. సబ్ జూనియర్స్ క్యాటగిరిలో సాలూరు భాష్యం స్కూల్ కిచెందిన గోళ్ళు రాజ్ దీప్ 70 మార్కులు, మక్కువ తారకరామా స్కూల్ కి చెందిన 4 వ తరగతి విద్యార్థి కొమ్మనాపల్లి తేజేశ్వర రావు 65 మార్కులు, నారాయణ స్కూల్ చెందిన మూడో తరగతి విద్యార్థి ఏం. యశ్వంత్ 43.5 మార్కులు సాధించినట్టు.ఎగ్జామ్ కి హాజరైన వారికి పార్టిసిపేట్ సర్టిఫికేట్ అందించినట్టు అకాడమీ డైరెక్టర్ ఏం.ఎస్.నాయుడు తెలిపారు.

