

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,ఆగస్టు16,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల ఎండిఓ,ప్రమోద్ కుమార్,కి ఎంపీ ఓ నరసింహ్మ రావు,లకు జిల్లాస్థాయిలో ఉత్తమ అధికారులుగా ఎంపికయ్యారు.ఈ నేపథ్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,కలెక్టర్ హనుమంతరావు,భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి,చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్నారు.ప్రభుత్వ అధికారులకు గా ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు ప్రభుత్వం వీరికి ఉత్తమ అధికారులుగా ప్రశంస పత్రాలను అందించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు,ఉద్యోగులు,తదితరులు,పాల్గొన్నారు.
