
సాలూరు, ఆగష్టు 16,గరుడ న్యూస్ ప్రతినిధి :నాగార్జున
శుక్రవారం నాడు సాలూరు శిశుమందిర్ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ముఖ్యఅతిథిగా రవ్వ శ్యామ్ శంకర్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో ముఖ్య అతిథిగా రావడం ఎంతో గర్వంగా ఉంది ఎంతోమంది మహా వీరుల ప్రాణ త్యాగఫలం మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అలాంటి మహనీయులు తలుచుకుంటూ ప్రతి విద్యార్థి బావి భారత పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్న అన్నారు.ఈరోజు చాలా ఆనందం అనిపించింది
పిల్లలు అందరూ చాలా డిసిప్లిన్ గా
చాలా చక్కగా కార్యక్రమం లో పాల్గొన్నారు
టీచర్స్ అందరూ అన్ని అరేంజ్మెంట్స్ నీటిగా చేశారు
ముఖ్యమైన విషయం ఏంటంటే
పిల్లలకు మంచి విలువలతో కూడిన విద్యని అందిస్తున్నారని అబ్జర్వ్ చేశాను
ఎందుకంటే ముగ్గురు పిల్లలకు నేను సరదాగా ఒక చిన్న టెస్ట్ చేసాను
చాక్లెట్ అంటే ఇష్టపడని పిల్లలు ఉండరు మనకి అందరికీ తెలుసు
నేను కొంత మంది 5 star చాక్లేట్ అందుకున్న పిల్లలకు సరదాగా రెండో సారి 5star చాక్లెట్ అందించే ప్రయత్నం చేశాను
కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా రెండోసారి తీసుకోలేదు
మాకు చాక్లెట్ అందింది సార్ అని కొంతమంది చెప్పారు
ఇంకా చిన్న పిల్లలు ఒకటే తీసుకోవాలి అంకుల్ అని ఎంతో ముద్దుగా సమాధానం సమాధానం చెప్పారు.
ఇలా పిల్లలలో నిజాయితీ చూసి నేను చాలా ఆనందపడ్డాను
ధర్మాన్ని , దైవాన్ని, నిజాయితీని తెలియచేస్తూ విలువలతో కూడిన విద్యని అందిస్తున్న ఉపాధ్యాయ బృందం అందరికీ
నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అన్నారు.
అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు మరియు పాటలు ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమం లో శిశు మందిర్ సిబ్బంది తో పాటు
రవ్వ శ్యామ్ , హరి స్వామి నాయుడు , మీసాల సునీత , పసుపు రెడ్డి మాధవి , కానుకలు రామకృష్ణ , నాగులు తాతాజీ , మద్దుల దీనదయాల్ గుప్త , బెవర నాగార్జున పాల్గొన్నారు.


