
సాలూరు, ఆగష్టు 16,గరుడ న్యూస్ ప్రతినిధి:నాగార్జున
సాలూరు పెద్ద కుమ్మరి వీధిలో ఉన్న భాగ్యలక్ష్మి సేవా సమితి (బిఎల్ఎన్ ) స్కిల్ డెవలప్మెంట్ వారి కార్యాలయంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సెక్రటరీ కె భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమె చేతుల మీదుగా జాతీయపతాక ఆవిష్కరించి అలాగే జాతీయగీతాన్ని ఆలపించారు. ఆమె మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేశారన్నారు.అంతే కాకుండా ఆమహనీయుల త్యాగాలను స్మరించుకుంటు వారి ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరం పునరాంకితం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ పొందుతున్న సభ్యులు పాల్గొన్నారు.


