


సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,ఆగస్టు16,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఈసీ విద్యాసాగర్ ఆదర్శ పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు దేశభక్తి గీతాలు,ఉపన్యాసాలు,దేశభక్తి గీతాలపై నృత్యాలు చేశారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కట్ల భాస్కర చారి,మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదివి మంచి ఫలితాలను సంపాదించి ఉన్నత స్థాయికి ఎదగాలని మన భారతదేశం స్వాతంత్రం కొరకు పోరాడిన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకొని భారతదేశాన్ని ఇంకా ఉన్నత స్థాయిలో నిలపాలని,నేటి బాలలే రేపటి పౌరులని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు,పాఠశాల ఉపాధ్యాయులు,పాల్గొన్నారు.
