
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,ఆగస్టు16,(గరుడ న్యూస్):
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సంస్థాన్ నారాయణపురం బిజెపి మండల శాఖ అధ్యక్షులు సుర్వి రాజు గౌడ్,ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం ముందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బచ్చనబోయిన దేవేందర్ యాదవ్,పాల్గొని మాట్లాడుతూ గడిచిన 79 ఏళ్లలోదాదాపు 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో దేశం చిన్నాభిన్నవై మత ప్రాతిపదికన విభజనకు గురైందని గత 11 సంవత్సరాల నరేంద్ర మోడీ,పాలనలో భారతదేశం అన్ని రంగాలలో విజయాలను సాధిస్తూ ప్రపంచంలోనే నాల్గవ ఆర్థిక శక్తిగా ఎదిగిందని దేశ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే ప్రధానమంత్రికి దేశ ప్రజలందరూ పూర్తి మద్దతుగా ఉన్నారు కాబట్టి మన ప్రాంతం నుండి కూడా ఆయనకు మనమందరం సంపూర్ణ మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు వంగరి రఘు,దాసోజు వెంకటాచారి,భాస్కర నరసింహ గౌడ్,బండమీది కిరణ్,చిలువేరు వెంకటేష్,గొల్లూరి యాదగిరి సాగర్,సంగిశెట్టి లక్ష్మీనారాయణ, మొగుదాల వెంకటేష్ గౌడ్,కట్కూరి లక్ష్మి వెంకటేష్,బద్దం యాదయ్య గౌడ్,జక్కర్తి నరసింహ,గూడూరు మంజునాథ్ రెడ్డి,సూరపల్లి జవహర్,వంటల గణేష్ యాదవ్,వీరమల్ల జంగయ్య గౌడ్,శిఖిలమెట్ల వెంకటేష్,శ్రీనివాస్ గౌడ్,చిలువేరు సాయిబాబా,సంగిశెట్టి నరేష్,అచ్చిని రవికుమార్,బద్దం సాయికిరణ్,మారసాని సాయి తదితరులు పాల్గొన్నారు.



