గరుడ న్యూస్, సాలూరు
18 వార్డు సచివాలయం వద్ద 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఛైర్పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ, 18 వార్డు తెలుగుదేశం నాయకులు నైన శ్రీనివాసరెడ్డి, 19 వ వార్డు తెలుగుదేశం నాయకులు జరజాపు రమేష్ సచివాలయ సిబ్బంది స్కూల్ పిల్లలు హాజరు అయ్యారు. స్వాతంత్రం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు ఫలితమే ఇప్పుడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం అని నాయకులు తెలియజేశారు.




