గరుడ ప్రతినిధి
చౌడేపల్లి ఆగష్టు 16
గొర్రెల మందపై చిరుత దాడి చేసి ఏడు గొర్రెలు కనిపించకుండా పోయిన సంఘటన శనివారం చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది పంచాయతీ కేంద్రమైన ఆమెని గుంటకు చెందిన సుధాకర్ సయ్యద్ భాషలు సమీపంలోని అంకాలమ్మ కొండకు తమ గొర్రెల మందను తరలించారు కొండపైకి ఎక్కుతూ గొర్రెలు మేస్తుండగా ఒక్కసారిగా చిరుత వాటిపై దాడి చేసింది ఈ దాడిలో ఓ గొర్రెలను కాపరి అయిన సునీల్ కాపాడడంతో మరో ఏడు గొర్రెలు కనిపించకుండా పోయాయి గత రెండు నెలలుగా చిరుత సంచారం ఉన్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు వాపోతున్నారు వ్యవసాయం జూదంలా మారిన ప్రస్తుత సమయంలో గొర్రెల పెంపకం పై ఆధారపడి జీవిస్తున్నామని ఇలాంటి పరిస్థితుల్లో చిరుత తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోందని ఇకనైనా సంబంధిత అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకొని చిరుత నుంచి తమ పశు పాడి గొర్రెల సంపదను కాపాడాలని రైతులు కోరుతున్నారు





