ప్రతి ఒక్కరికి కంటిచూపు బాగుండాలనే ఉద్దేశంతో ఉచిత కంటి వైద్య శిబిరాలు,గట్టుప్పల్ మండల ప్రజలకు 7వ, ఉచిత కంటి వైద్య శిబిరంకోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

singhamkrishna
2 Min Read

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,ఆగస్టు16,(గరుడ న్యూస్):

తన మాతృమూర్తి  కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద  మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరు  కంటి సమస్యలతో బాధపడొద్దనే ఆలోచనతో ఉచిత కంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టారు  మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.ఇప్పటివరకు  ఆరు విడతలుగా నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలలో  4355 మందికి కంటి పరీక్షలు చేసి 1051 మంది కి కంటి ఆపరేషన్లు పూర్తిచేశారు.మునుగోడు మండల ప్రజలకు మునుగోడు లో నిర్వహించి న మొదటి విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో 216 మందికి,రెండవ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో 108 మందికి,చండూరు మున్సిపాలిటీ ప్రజలకు మునుగోడు లో నిర్వహించిన మూడవ విడత  ఉచిత కంటి వైద్య శిబిరంలో  129 మందికి,నాంపల్లి మండలప్రజలకు నాంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన నాలుగవ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో 229 మందికి,మర్రిగూడ మండల కేంద్రంలో నిర్వహించిన ఐదవ విడత కంటి వైద్య శిబిరంలో 171 మందికి,చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన ఆరవ విడత కంటి వైద్య శిబిరంలో 198 మందికి  కంటి ఆపరేషన్లు పూర్తి చేశారు.మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కంటి సమస్యతో బాధపడుతున్న ప్రతి తల్లి,ప్రతి తండ్రి కి పెద్దకొడుకుగా మారి కంటి   ఆపరేషన్ లు చేయిస్తున్నారు.రాబోయే మూడున్నర సంవత్సరాలలో నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో బాధపడకుండా ఉండాలని ప్రణాళిక రూపొందించారు.ఆ ప్రణాళికలో భాగంగానే 10 పదివేల మందికి  కంటి శస్త్ర చికిత్సలు చేయించేలా టార్గెట్ పెట్టుకున్నారు.ఆదివారం గట్టుప్పల్ మండల కేంద్రంలోని  ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  7 వ,విడత  ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫీనిక్స్ ఫౌండేషన్ శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.గట్టుప్పల్  ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన ఏర్పాట్లను స్థానిక నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.గట్టుప్పల్  మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని  సద్వినియోగపరుచుకోవాలని ఇప్పటికే గ్రామాలలో టామ్ టామ్ వేయించి ప్రచారం నిర్వాహించారు స్థానిక నాయకులు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *