గరుడ న్యూస్.పుంగనూరు ప్రతినిధి ఆగస్టు 17
తితిదే పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో శ్రావణ మాసం నాలుగవ శనివారం సందర్భంగా ఆలయానికి భక్తులు బారులు తీరారు.. ఈ సందర్భంగా స్వామి వారిని ఉదయం సుప్రభాత సేవ తో మేల్కొలిపి, నిత్యార్చనలు జరిపి స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు.. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు త్వరితగతిన దర్శనం జరిగే విధంగా ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి క్యూ లైన్లను పర్యవేక్షిస్థూ, భక్తులకు త్రాగునీరు, దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంగీత కార్యక్రమాలు భక్తులను అలరించాయి.. అదేవిధంగా పుంగనూరు సి.ఐ. శ్రీ సుబ్బారాయుడు గారి ఆదేశాలతో పోలీసు సిబ్బంది పాదచారులకు, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తూ భక్తుల సేవలో తరించారు..

భక్తులకు విశ్రాంత డీఎస్పీ శ్రీ సుకుమార్ బాబు గారి సేవలు
ఈ సందర్భంగా ప్రతి శనివారం సాయంత్రం ఆలయంలో విశ్రాంత డీఎస్పీ శ్రీ సుకుమార్ బాబు గారు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించేవారు.. అదేవిధంగా ఈ శనివారం నాడు కూడా భక్తులకు లడ్డు ప్రసాదం పంపిణీ చేశారు.. అదేవిధంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, అర్చకులకు, ఆలయ సిబ్బందికి పంచలు అందజేశారు.. ఈ కార్యక్రమంలో పుంగనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ సుబ్బారాయుడు గారు పాల్గొన్నారు..



