
తిరుపతి జిల్లా, గరుడ న్యూస్ ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా దక్కవలసిన DA బకాయిలను మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల తరపున ఆంధ్రప్రదేశ్ CPS ఎంప్లాయిస్ అసోసియేషన్ (APCPSEA) హైకోర్టు లో WP.NO.32090/2025 ద్వారా 14.08.2025 వ తేదిన రాష్ట్ర ప్రభుత్వం పై కేసు ను ఫైల్ చేయడం జరిగింది. CPS రద్దు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాడి, ఆ పోరాట ఫలితంగా మరణించిన CPS ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్, డెత్ గ్రాట్యుటీ సాధించి పెట్టిన ఏకైక అసోసియేషన్ గా చరిత్రలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ CPS ఎంప్లాయిస్ అసోసియేషన్ (APCPSEA) తరపున రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కులు, విలువల కోసం నిరంతరం పోరాడుతానే ఉంటాము, ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ CPS ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎల్లపుడు అండగా ఉంటామని తెలియచేస్తున్నాము.
సదా ఉద్యోగుల సేవలో..
మీ.. చీర్ల కిరణ్
రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ CPS ఎంప్లాయిస్ అసోసియేషన్



