
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, చౌటుప్పల్,అగష్టు18,(గరుడ న్యూస్):
చౌటుప్పల్ మండల కేంద్రంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ రాంప్రసాద్ మరణించిన విషయం తెలుసుకున్న నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం మాట్లాడుతూ చౌటుప్పల్ డివిజన్,చుట్టుపక్కల మండలాల ప్రజలు ప్రముఖ వైద్యున్ని కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. వైద్య రంగంలో ఎంతో మంది ప్రజలకు వైద్య సేవలను అందించాలని వారి యొక్క సేవ లింగస్వామి గుర్తు చేశారు.ఈ యొక్క కార్యక్రమంలో పెద్దగోని రమేష్ గౌడ్,పాలకూర్ల వెంకటేష్ గౌడ్,నాతి లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



