
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,అగష్టు18,(గరుడ న్యూస్):
యాదాద్రి భువనగిరి జిల్లా,సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనుచరులు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కింది స్థాయి నుంచి పైకి వచ్చి మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ది అని బీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు.మళ్లీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఏర్పడతాయని బిఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్రి నరసింహ్మ,జక్కిడి ధన్వంత రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ బిక్షం,లారీ బిక్షం,గుడ్డి మల్కాపురం మాజీ ఎంపిటిసి శివరాత్రి కవిత విద్యాసాగర్,రాసాల వెంకటేష్,రాచకొండ గిరి,ఉప్పల ఆంజనేయులు,పాండు నాయక్,వాకుండా రాజు నాయక్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు,పాల్గొన్నారు.



