
గరుడ ప్రతినిధి
చౌడేపల్లి ఆగష్టు 18
శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానం ధర్మకర్తలి మండలి సభ్యుని కోసం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు చౌడేపల్లికి చెందిన మాదిరాజు లక్ష్మణ రాజు (పతిరాజు) దరఖాస్తు చేశారు పుంగనూరు నియోజకవర్గంలోని కూటమి నాయకులతోపాటు ఆయన దరఖాస్తు చేశారు తొలుత అమ్మవారి సన్నిధానంలో దరఖాస్తు ఫారాలు ఉంచి అనంతరం ఈవో ఉప కమిషనర్ ఏకాంబరంకు ఆయన దరఖాస్తు ఫారాలను అందించారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు తాను బోయకొండ ధర్మకర్తల మండలి సభ్యుని కోసం దరఖాస్తు చేశానన్నారు తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీలకు చెందిన నాయకుల సమక్షంలో దరఖాస్తు ఫారాలు ఇవ్వడం సంతోషదాయకంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాదిరాజు వెంకటరమణ రాజు యువ నాయకులు మాదిరాజు ప్రదీప్ రాజు బోయకొండ శివప్ప తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కార్తీక్ సింగిల్ విండో చైర్మన్ హరి రాయల్ నాగరాజు రెడ్డి బిజెపి మండలాధ్యక్షుడు మనోహర్ నాయకులు గందోడి ప్రవీణ్ కుమార్ పుంగనూరు నాయకులు మాధవరెడ్డి సి వి రెడ్డి గిరి తెలుగుదేశం బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

