
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, చండూరు,అగష్టు19,(గరుడ న్యూస్):
సామాజిక ఉద్యమకారుడు కొమ్ము గణేష్ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి బహుజన చక్రవర్తి దొరల నిరంకుశత్వాన్ని ఎదిరించిన యుద్ధ వీరుడు మొగల్ దౌర్జన్యాన్ని ఎదిరించితెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన తెలంగాణ విప్లవతేజం గోల్కొండ కిల్లా పై బహుజన జెండాను ఎగురవేసిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా కొండాపురం గ్రామంలో ప్రజలు యువకులు విద్యావంతులు మేధావులు అందరూ కలిసి చాలా ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చామకురి ప్రభాకర్,మహేష్, అయితగాని లింగయ్య,శంకర్,పాలెం శీను,బొడ్డు శంకరాచారి,చేపూరి వెంకన్న,తదితరులు,పాల్గొన్నారు.


