గరుడ ప్రతినిధి
చౌడేపల్లి ఆగష్టు 19
కుమారుడిపై తండ్రి కొడవలితో దాడి చేసి గాయపరిచిన సంఘటన చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది బాధితుల కథనం మేరకు… మండలంలోని పెద్ద కొండా మరి గ్రామానికి చెందిన అంజప్ప పక్క గ్రామంలో ఓ మహిళతో గత 15 సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కుదుర్చుకున్నాడు అప్పటి నుంచి ఇంటికి రాకుండా చౌడేపల్లిలో సంత గేటు వద్ద టైలరింగ్ వృత్తి చేసుకుంటూ ఉన్నాడు ఈ క్రమంలో ప్రభుత్వం ఇటీవల రేషన్ కార్డుల మార్పిడి సందర్భంగా అతని పేరు రేషన్ కార్డులో మార్చి రాసుకున్నాడు దీంతో ఇదేమిటని అంజప్ప కుమారుడు విజయ్ కుమార్ అమరావతి అల్లుడు వెంకటరమణలు వెళ్లి ఇదేమిటని ప్రశ్నిస్తే తండ్రి అంజప్ప కోపోద్రికుడై కొడవలి కత్తెర లతో తమపై దాడి చేసినట్లు వారు వివరించారు గాయాలపాయలైన తమను స్థానికులు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాలని ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు





