


సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,అగష్టు20,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ మండల అధ్యక్షులు రాసమల్ల యాదయ్య,ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో మొదటినుంచి కష్టపడి పనిచేస్తున్న తమని నిన్న మొన్న కొంతమంది తక్కువ చేసి చూస్తున్నారని,ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లకుండా దూరం చేస్తున్నారని ఆయన పేరు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారని ఈ సందర్భంగా రాసమల్ల యాదయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యే సమయాన అనవసరమైన మాటలను మాట్లాడి కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు.ఇకనైనా పార్టీని బలోపేతం చేయడానికి అందర్నీ కలుపుకుపోవాలని ఆయన హితబోధ చేశారు.కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కలిసి కష్టపడుదామని పత్రికాముఖంగా ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,సీనియర్ నాయకులు, కార్యకర్తలు,తదితరులు,పాల్గొన్నారు.