

కడప జిల్లా, బ్రహ్మం గారి మఠం మండలం, గరుడ న్యూస్ ప్రతినిధి: A.ఓబుల్ రెడ్డి; బ్రహ్మంగారిమఠం మండలం జిల్లా పరిషత్ గోవిందమాంబ బాలికోన్నత పాఠశాల నందు విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లో ప్రతిభను చాటుతున్నారు.ఆంధ్రప్రదేశ్ లోని జంప్ రోప్ పోటీ లు నెల్లూరు జిల్లాలో ని కావలిలో నిర్వహించడం జరిగింది. అందులో మా పాఠశాల విద్యార్థులు c జస్సి గోల్డ్, సిల్వర్ మెడల్స్ మరియు B నాగ శ్వేత సిల్వర్ మెడల్, p ఉమా మహేశ్వరీ సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ లొని 3వ లగోరి రాష్ట్రస్థాయి పోటీలు కడప జిల్లాలోని మైదుకూరులో నిర్వహించిన పోటిల్లో అక్కడ మా స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటి రెండవ స్థానం సిల్వర్ మెడల్ సాధించడమైనది. ఆటల పోటీలకు వెళ్లేందుకు ప్రోత్సహించిన హెచ్ఎం O. లక్ష్మణ స్వామి రెడ్డి, తెలుగు ఉపాధ్యాయులు ఎల్ కొండారెడ్డి,పిడి పుష్పలత, విజయలక్ష్మి, ఎలిజిబెత్ రాణి, కమల్.బి, సంధ్యారాణి, కే.సుమతి, కే.పరిమిల, కళాభారతి, చెన్నమ్మ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించి అభినందించారు.

