రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Ashok kumar
1 Min Read

గరుడ ప్రతినిధి
చౌడేపల్లి ఆగష్టు 21

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది చౌడేపల్లి బోయకొండ ప్రధాన రహదారిలో చౌడేపల్లి వైపు వస్తున్న టు వీలర్ ను బోయకొండ వైపు వెళ్తున్న కారు ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఢీకొన్నది ఈ ప్రమాదంలో మర్రిమాకులపల్లికి చెందిన చక్రపాణి 28 తీవ్ర గాయాల పాలయ్యాడు అదే వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక్కడ అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి సిఫార్సు చేశారు అయితే ఆలోపే మార్గమధ్యంలో చక్రపాణి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు మరి మాకులపల్లి గ్రామంలో విషాదఛాయలు చోటుచేసుకున్నాయి  పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్లు ఎస్ ఐ నాగేశ్వరరావు తెలిపారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *