


తిరుపతి జిల్లా, తిరుచానూరు గరుడ న్యూస్ ప్రతినిధి: పాఠశాలల్లో పరీక్షల నిర్వహణలో మూల్యాంకన పుస్తకాలు విద్యార్థులకు సరఫరా చేయుట అనే కొత్త విధానం అనేక క్రొత్త సమస్యలకు దారి తీస్తుంది. ఈ విధానం పాఠశాల పనివేళలలో జరగాల్సిన బోధనా సమయాన్ని హరించే విధంగా ఉంది. గతంలో పరీక్ష పేపర్లు ఇంటి వద్ద దిద్దే పద్ధతికి బదులు పాఠశాలలో పుస్తకాలను ఇంటికి తీసుకుని వెళ్లలేని స్థితి ఏర్పడింది. వందలాది పుస్తకాలను మోసుకొని వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనితో పాఠశాలలో మూల్యాంకనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడి బోధనా గంటలకు అంతరాయం ఏర్పడుతోంది. మార్కుల నమోదు కూడా ఉపాధ్యాయులకు పని భారంగా పరిణమించింది. ఇప్పటికే ఆన్లైన్ నమోదు,రిజిస్టర్ నమోదు తో పాటు ఇప్పుడు బబ్లింగ్ చేసే పని కూడా ఉపాధ్యాయులకు సంక్రమించింది. ఆన్లైన్ విధానంలో నమోదుకు మాత్రమే పరిమితమై మిగిలిన నమోదు నుండి వెసులుబాటు ఇవ్వాలి. ఈ కొత్త విధానం వలన మంచి ఫలితాలు రావు సరికదా నష్టదాయకంగా మారకముందే ఈ విధానం నుంచి వైదొలగాలని కోరుచున్నాము. రాష్ట్ర సంఘం ఆదేశానుసారం తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ శాఖ తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కే వీ యెన్ కుమార్ గారికి మెమరాండంను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షులు బి.మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి బి బాలసుబ్రమణ్యం గౌరవ సలహా గారు ఎస్. వెంకటముని, జిల్లా ఉపాధ్యక్షులు డి.వి. మదన్మోహన్, జిల్లా బాధ్యులు చంద్రశేఖర్, తొట్టంబేడు మండల అధ్యక్షులు రామదాసు, ఉపాధ్యక్షులు పెరుమాళ్ళు తదితరులు పాల్గొన్నారు.



