
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,అగష్టు22,(గరుడ న్యూస్)
సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ లో ఈరోజు బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థుల యొక్క ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ జి. మల్సూర్ హాజరయ్యారు.మల్సూర్ విద్యార్థుల నిర్దేశించి మాట్లాడుతూ,మీరు ఇప్పటివరకు గడిపిన జీవితం వేరు ఇప్పటినుండి గడిపే జీవితం వేరు అని చెబుతూ ఇంజనీరింగ్ విద్య మీ జీవితాలనే మార్చి వేస్తుంది బాగా విద్యను అభ్యసించిన వారు గొప్ప గొప్ప ఇంజనీర్లు సైంటిస్టులు అవుతారు కేవలం సాంకేతిక విద్యనే కాక నూతన ప్రమాణాలతో కూడిన మీడియాలతో టెక్నాలజీస్టులుగా కూడా మారవచ్చు అని వివరించారు.ప్రస్తుత పరిస్థితుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీలు దేశ మౌలిక పరిస్థితులను మార్చివేసే టూల్స్ గా మారిపోయాయని ఇంజనీరింగ్ లో ప్రతిభను చాటటం వల్ల దేశ ప్రగతిని మార్చే ఆయుధాలుగా మారవచ్చని క్లుప్తంగా వివరించారు.తర్వాత కళాశాల చైర్మన్ డాక్టర్ జి. నాగయ్య మాట్లాడుతూ,గత 15 సంవత్సరాలుగా కాలేజ్ సాధించిన విజయాలను గుర్తు చేస్తూ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య ప్రాముఖ్యతను తెలుపుతూ ఇంజనీరింగ్ అంటే కేవలం పుస్తకాలు ఎగ్జామ్స్ మాత్రమే కాదు,సృజనాత్మకంగా ఆలోచించడం ప్రాబ్లంలను పరిష్కరించే పరిజ్ఞానం,నూతన పరిశోధనల నైపుణ్యాలను ప్రదర్శించడం అని విద్యార్థులకు గుర్తు చేశారు.కార్యక్రమ నిర్వాహకులను కళాశాల సెక్రటరీ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్ అభినందించారు.ఈ కార్యక్రమంలో మొదటి సంవత్సరం హెచ్ ఓ డి లు డాక్టర్ మారగోనివెంకటేశం,డాక్టర్ టి. కృష్ణార్జున రావు,ఇతర డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి లు,ఉపాధ్యాయ,అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అందరూ,అన్ని సంవత్సరాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది.


