
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,అగస్టు23,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కారంటోట్ శ్రీను నాయక్ శుక్రవారం నాడు సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో పత్రికాముఖంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ ఆదేశాలను పాటిస్తూ క్రమశిక్షణతో పార్టీ అభివృద్ధికి శ్రేయస్సుకోసం కృషి చేయాలి అని తెలియజేశారు.పార్టీకి సంబంధం లేని వ్యక్తి అయిన చలమల్ల కృష్ణారెడ్డి వెంట ఎవరు వెళ్లరాదని మద్దతు తెలుపరాదని ఆయనకు అనుకూలమైన పత్రికా ప్రకటనలు ప్రెస్ మీట్లు నిర్వహించరాదని అతను కాంగ్రెస్ పార్టీలో లేనందున ఎలాంటి మద్దతు తెలుపరాదని నాయకులకు కార్యకర్తలకు తెలియపరుచుచున్నాము అని శ్రీను నాయక్ చెప్పారు.ఈ ఆదేశాలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆడెపు సంజీవరెడ్డి ఆదేశానుసారము అని శ్రీను నాయక్ తెలియ జేశారు.ఒకవేళ కావాలని ఉద్దేశపూర్వకంగా పార్టీలో లేని వ్యక్తి అయిన చలమల్ల కృష్ణారెడ్డి,కి మద్దతు ప్రకటించి అతని వెంట వెళ్లిన పార్టీపరమైన చర్యలు తీసుకొనబడును అని తెలియజేశారు.కావున మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు,గ్రహించి ఇట్టి విషయములో ఎవరైనా ఏ స్థాయిలో ఉన్న పార్టీ పరమైన కఠిన చర్యలు తీసుకొని సస్పెన్షన్ చేయబడును అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు,పాల్గొన్నారు.


