
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,అగస్టు23,(గరుడ న్యూస్)
భారతీయ జనతా పార్టీ మండల పదాధికారుల సమావేశం ఆ పార్టీ మండలాధ్యక్షులు సుర్వి రాజు గౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దోనూరు వీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందినందుకు నిరసనగా,మండలంలోని స్థానిక సమస్యలైన సాగునీరు,లింకు రోడ్లు,ఇతరత్రా సమస్యలపై ఈనెల 28న సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నామని,దానికోసం మండలంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మండల పదాధికారులు జిల్లా పదాధికారులు శక్తి కేంద్ర ప్రబారీలు ప్రముఖులు భూత్ అధ్యక్ష,కార్యదర్శులు సీనియర్ నాయకులందరూ తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బచ్చనబోయిన దేవేందర్ యాదవ్,ఓ బి సి మోర్చా రాష్ట్ర కార్యదర్శి జక్కలి రాజు యాదవ్,భాస్కర నరసింహ,వంగరి రఘు,దాసోజు వెంకటాచారి,బండమీది కిరణ్,చిలువేరు వెంకటేష్,నందగిరి జగత్ కుమార్,ఎలిజాల శీను,కట్కూరి వెంకటేష్ గౌడ్,బద్దం యాదయ్య గౌడ్,గూడూరు మంజునాథ్ రెడ్డి,సుర్వి లింగస్వామి గౌడ్,గంజి సునీల్,రవీందర్ రెడ్డి, తదితరులు,పాల్గొన్నారు.


